శేరిలింగంపల్లి, నవంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): కార్తీక మాసం సందర్భంగా బీఎన్ రెడ్డి నగర్లోని హస్తినాపురం జడ్పీ రోడ్ గోల్డెన్ హోమ్స్ సత్యదేవకి రెసిడెన్సిలో ఆదివారం సామూహిక సత్యనారాయణ వ్రతాలను, రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ ఎంతో ఉత్సాహంతో, భక్తిశ్రద్ధలతో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణా రాజు, ప్రధాన కార్యదర్శి నగేష్, ఇతర అసోసియేషన్ సభ్యులు పాల్గొని సహ పంక్తి భోజనాలు చేశారు.






