కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి న‌వీన్ యాద‌వ్‌కు వడ్డెర సంఘం నాయకుల మ‌ద్ద‌తు

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 9 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వడ్డెర సంఘం నాయకులు తెలంగాణ ఐక్యత వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేముల యాదయ్య, ఉపాధ్యక్షుడు గొలుసుల ఎల్లయ్యను, వడ్డెర సంఘం నాయకులను ప‌లువురు కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు మర్యాదపూర్వకంగా కలిసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నవీన్ యాదవ్ ని గెలిపించాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా స్పందించిన‌ వడ్డెర సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీకి, నవీన్ యాదవ్ గెలుపుకు తమ పూర్తి మద్దతు తెలియ‌జేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వడ్డెర సంఘం నాయకులు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి గుంజ రేణుక నారాయణ, వడ్డెర సంఘం నాయకుడు సమ్మయ్య, అఖిలభారత వడ్డెర సంక్షేమ సంఘం శేరిలింగంపల్లి నియోజక వర్గం అధ్యక్షుడు ముద్దంగుల తిరుపతి, పల్లపు రాములు, గుంజ నాగేష్, సంపంగి, బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here