సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీ వాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్ లోని ఆయ‌న‌ కార్యాలయంలో సీనియర్ నాయకుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీలో అంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల ను పూర్తి చేయాలని కోరారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ త్వరలోనే సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీ లో త్వరలోనే పర్యటిస్తానని, రోడ్డు పనులను ప్రారంభిస్తామని, కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని, అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల స‌మ‌స్య‌ను త్వరితగతిన పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , సాంబశివరావు, అంకారావు, అబ్దుల్ రహమాన్, రాములు యాదవ్, సత్యం, భుజంగం, అప్పలరాజు, ముక్తార్, నర్సింహ, కృష్ణ యాదవ్, రవి, భాస్కర్, మహేష్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here