శేరిలింగంపల్లి, అక్టోబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారా నగర్ కి చెందిన సయ్యద్ అజార్ అలీకి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా CMRF-LOC ద్వారా మంజూరైన రూ.2,50 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన మంజూరు పత్రాన్ని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారిని ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని తెలిపారు. అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరుపేదలకు, అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసానిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రఘునాథ్ రెడ్డి, అక్బర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.