ఘ‌నంగా దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడ కాలనీలో దసరా పర్వదినం సందర్భంగా శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ దుర్గాదేవి అమ్మవారి మండపంలో జరిగిన పూజ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ దేవీ శరన్నవరాత్రి వేడుకలను ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో , శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రగడ సత్యనారాయణ, కాలనీ వాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

పూజ‌ల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here