శేరిలింగంపల్లి, మార్చి 29 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం మసీద్ బండ పరిధిలోని బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. అనారోగ్యం, ఇతర కారణాలతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రజా సేవలో ఎల్లప్పుడూ ముందుంటాం అని తెలిపారు.






