శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ కాలనీకి చెందిన నౌసిన్ బేగం అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF LOC ద్వారా మంజూరైన రూ.70,000 ఆర్థిక సహాయానికి సంబందించిన CMRF LOC మంజూరు పత్రాన్ని కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సమ్మారెడ్డి, మంత్రిప్రగడ సత్యనారాయణ, అష్రాఫ్, గోపాల్, లింగం , సత్యనారాయణ, దర్శన్, వేణు గోపాల్ రెడ్డి, మంజుల, పద్మ తదితరులు పాల్గొన్నారు.






