శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రపంచ స్వచ్ఛతా దినోత్సవం సందర్భంగా నేతాజీ నగర్ కాలనీలో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించారు. గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలో కమిటీ హాల్ నాలాలో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యని నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ జిహెచ్ఎంసి సిబ్బంది సహాయంతో పరిష్కరించారు. నాలాని దగ్గరుండి శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రబలుతున్న వ్యాధులన్నీ మన పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం వలనే అన్నారు. కాలనీలోని ప్రతి కుటుంబం తమ బాధ్యతగా తీసుకొని తమ ఇంటిని పరిసరాలను, కాలనీని పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. వర్షాలు అధికమైనందున వ్యాధులు కూడా అధికమవుతాయి. కాలనీ ప్రజలు వ్యాధుల బారిన పడకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.






