ఆడపడుచుల పెద్ద పండుగ బతుకమ్మ: కార్పొరేట‌ర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆడపడుచుల పెద్ద పండుగ బతుకమ్మ అని, 9 రోజులపాటు పూలనే దేవతలుగా ఆరాధించే గొప్ప సాంప్రదాయం మనదని కార్పొరేట‌ర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బతుకమ్మ పండుగ వేడుకలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థినులు తెచ్చిన తంగేడు, గునుగు, తామర, చామంతి, బంతి పూలతో తెలంగాణ సంస్కృతిని ఉట్టిపడేలా పేర్చిన బతుకమ్మను చూసి కార్పొరేటర్ అభినందించారు. పాఠశాల ఆవరణలో విద్యార్థినిలతో కలిసి బతుకమ్మ డీజే స్టెప్పులకు చప్పట్లు కొడుతూ విద్యార్థినిలతో ఆడి పాడి వారిలో జోష్ నింపారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి మనిషి జీవితానికి ప్రకృతితో విడదీయరాని అనుబంధం పెనవేసుకొని ఉంటుందని ప్రకృతి మనిషికి జీవంతో పాటు అహ్లాదాన్ని, ఆనందాన్నిస్తుందని అలాంటి ప్రాస్తశ్యం బతుకమ్మ పండుగకు ఉందని తెలిపారు. 9 రోజులు 9 రూపాల్లో బతుకమ్మను తయారుచేసి పాటలు పాడుతూ భక్తిశ్రద్ధలతో బతుకమ్మ పండుగను తెలంగాణ వ్యాప్తంగా పిల్లా పెద్ద ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారని 9 రోజుల పాటు పూలనే దేవతలుగా ఆరాధించే గొప్ప సంప్రదాయం మనదని వివరించారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుభాష్ చంద్రరెడ్డి, పి.ఆర్.టీ.యు టి.ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్యామల మహేందర్ రెడ్డి, ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు బల్వంత్ రెడ్డి, పిఈటీ కేశవ రెడ్డి, ఉపాధ్యాయులు వీరేశం, ఆంజనేయులు, కర్ణ, లక్ష్మి, ఉదయకుమారి, దుర్గా భవాని, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థి విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here