ప్రగతి ఎంక్లేవ్‌లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్‌లో కొత్తగా ఏర్పడిన 240వ డివిజన్ ప్రగతి ఎంక్లేవ్ కాలనీలో అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. కాలనీ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, రోడ్లపై చెత్త వేయకుండా చెత్తరహిత, శుభ్రమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, ప్రజలకు తడి చెత్త – పొడి చెత్త వేర్పాటు పై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా అట్టేపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రగతి ఎంక్లేవ్ అధ్యక్షుడు అట్టేపల్లి రామప్రభు మాట్లాడుతూ ఈ తరహా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం ఒక్కొక్క కాలనీలో నిరంతరంగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే శాశ్వత మార్పు సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పిల్లలు, పురుషులు స్వచ్ఛందంగా పాల్గొని శ్రమదానం చేశారు. ఈ కార్యక్రమంలో అట్టేపల్లి రామప్రభు టీం (ARP) సభ్యులు, అట్టేపల్లి చారిటబుల్ ట్రస్ట్ టీం సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here