శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 8 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన స్టార్ మెడికల్ & జనరల్ స్టోర్ కు కార్పొరేటర్ హమీద్ పటేల్ ముఖ్య అతిథి హాజరై స్థానిక నాయకులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్బంగా స్టార్ మెడికల్ & జనరల్ స్టోర్ యాజమాన్యం మారుతీకి కార్పొరేటర్ హమీద్ పటేల్ శుభాకాంక్షలు తెలియజేశారు. కస్టమర్ల నమ్మకం సంపాదించి, మరిన్ని శాఖలుగా విస్తరించాలని ఆకాంక్షించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పి. శ్రీనివాస్ చౌదరి, డా. రమేష్ గౌడ్, టీ. రజనీకాంత్, యాదగిరి, తాడేం మహేందర్, అజ్జు, వెంకటేష్ పటేల్, అభి అక్షయ్, మొహ్మద్ వసీం తదితరులు పాల్గొన్నారు.






