శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 8 (నమస్తే శేరిలింగంపల్లి): ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం వేగం అందుకుంది. శేరిలింగంపల్లి నియోజకవర్గం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ ని ఎన్నికల కోఆర్డినేటర్‌గా నియమించడంతో, ఆయన ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా మున్సిపల్ పరిధిలో గడపగడపకూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకుడు మిరియాల ప్రీతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. మిరియాల ప్రీతమ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






