వివేకానందనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిదిలోని వివేకానందనగర్ డివిజన్ రిక్షా పుల్లర్స్ కాలనీలో ఉన్న చర్చిలో క్రిస్మస్ వేడుకలను బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ వేడుకలకు డివిజన్ బీజేపీ నాయకురాలు ఉప్పల విద్యా కల్పన ఏకాంత్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్స్ ఏఎస్ శామ్ సన్, మాణిక్యం, నెహెమియా, ఆనంద్, స్థానికులు పాల్గొన్నారు.