చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ జాతీయ రహదారి పక్కన పెట్రోల్ పంప్ వద్ద కొనసాగుతున్న అక్రమ నిర్మాణాన్ని అధికారులు బుధవారం కూల్చివేశారు. సదరు నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇటీవలే చందానగర్ సర్కిల్ డీసీ సుధాంష్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే సదరు నిర్మాణాన్ని అధికారులు కూల్చివేశారు. చందానగర్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని, కూల్చివేస్తామని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.