మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాజీ కేంద్ర మంత్రి, 1969 తెలంగాణ ఉద్యమ నాయకుడు, తన బాబాయి డాక్టర్ మల్లికార్జున్ 18వ వర్ధంతి సందర్భంగా నల్లగండ్ల గ్రామంలోని ఆయన సమాధి వద్ద శ్రీ కృష్ణ యూత్ వ్యవస్థాపకుడు, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణ యూత్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, అడ్వైజర్ సునీల్, నాయకులు భాగ్య రావు, ప్రభాకర్, గౌరవ అధ్యక్షుడు బాలకృష్ణ, లక్ష్మణ్, భాస్కర్, శ్రీ కృష్ణ యూత్ అధ్యక్షుడు రేవంత్, సాయిరామ్, జయసాయి, సతీష్ పాల్గొన్నారు.

