ఫ్రెండ్స్ వెల్ఫేర్‌, స్మిత డెంట‌ల్ ఆద్వ‌ర్యంలో డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ చిన్నారుల‌కు దంత ప‌రీక్ష‌లు

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్‌లో డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీలో విద్యార్థులకు చందానగర్ లోని స్మితా దంత వైద్యశాల సహకారంతో ఉచితంగా దంతవైద్య శిబిరాన్ని నిర్వహించారు. దంత వైద్యులు శ్రీధర్ రెడ్డి దంత పరీక్షలు నిర్వహించి ఉచితంగా టూత్ పేస్ట్ లు, మందులు పంపిణి చేశారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ పాల్గొని మాట్లాడారు. దంత సమస్యలు ఉన్నవారు తీసుకొనే ఆహారం పూర్తిగా నమలలేక పోవటం వలన జీర్ణం కాక అనేక ఉదరకోశ వ్యాధులు వస్తాయన్నారు. దీనితో కాలక్రమేణా కిడ్నీ , లివర్ , గుండె వ్యాధులు రావటానికి అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా భారత వికాస్ పరిషత్ ఆర్యభట్ట మాదాపూర్ శాఖ అధ్యక్షుడు వి.ఫణికుమార్, సురేందర్ రెడ్డి, పిబి శ్రీనివాస్‌లు విద్యార్థిని, విద్యార్థులకు నోట్ బుక్స్, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాలం శ్రీను, జనార్దన్, బమిడిపాటి వెంకటేశ్వరరావు, డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ నిర్వహకురాలు చావ అరుణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

చిన్నారుల‌కు నోట్‌బుక్స్‌, పండ్లు పంపిణీ చేస్తున్న భారత వికాస్ పరిషత్ ఆర్యభట్ట ప్ర‌తినిధుల‌తో రామ‌స్వామి యాద‌వ్‌, డాక్ట‌ర్ శ్రీద‌ర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here