గంగారం హ‌నుమాన్ దేవాల‌య ప్రాంగ‌ణంలో జ‌మ్మి మొక్క‌ నాటిన రాష్ట్ర టూరిజం డెవల‌ప్మెంట్ చైర్మ‌న్ ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్త‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు.. చందాన‌గ‌ర్‌లో ఊరి ఊరికో జమ్మి చెట్టు, గుడి గుడి కో జమ్మి చెట్టు కార్యక్రమం నిర్వ‌హించారు. చాలెంజ్‌ను స్వీక‌రించిన తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీతో క‌ల‌సి గంగారం హ‌నుమాన్ దేవాలయ ప్రాంగ‌ణంలో 2 జ‌మ్మిచెట్టు మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. మానవ మనుగడకు మొక్కలే ప్రాణం హరిత తెలంగాణే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కృషి చేస్తున్నారన్నారు. వాతవారణ సమత్యులను కాపాడేందుకు ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలన్నారు. రాష్ట్ర వృక్షం జమ్మి చెట్ట‌ని, ఈ వృక్షాన్ని ప్రపంచ అద్భుత వృక్షం గా చెప్పుకోవచ్చన్నారు.

శ్రీనివాస్ గుప్త నాటిన జ‌మ్మిచెట్టుకు నీరు పోస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ

తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల‌లో, ఇత‌ర అనేక‌ దేశాలలో భక్తిపూర్వకంగా పూజించుకునే జమ్మి చెట్టు పౌరాణికంగా, చారిత్రకంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా, పర్యావరణపరంగా, ఔషధంగా ఎంతో ప్రాధాన్యం క‌ల‌ద‌ని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ జమ్మిని రాష్ట్ర వృక్షంగా ప్రకటించారని గుర్తు చేశారు. నగరంలోని 1100 దేవాలయాల్లో 1100 జమ్మి చెట్టు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, చందా నగర్ ఐవీఎఫ్ అధ్య‌క్షుడు కోటేశ్వరరావు, గంగారం శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయ కమిటీ ప్రెసిడెంట్ రాజు, వైస్ ప్రెసిడెంట్ రవికుమార్, జనరల్ సెక్రటరీ భగత్ కుమార్, ట్రెసరర్ గోపి, నాయ‌కులు భుజంధర్, పబ్బ శ్రీనివాస్ గుప్త, పబ్బ మల్లేష్ గుప్త, కంచర్ల వెంకటేష్, శ్రవణ్, అర్చకులు, ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here