శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 17 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందానగర్ పీజేఆర్ స్టేడియంకు చెందిన విద్యార్థి సీవీ చేతన్ ఆదిత్య హైదరాబాద్ అండర్ 14 క్రికెట్ జట్టుకు ఎంపికవడమే కాకుండా ఇటీవల జరిగిన టోర్నమెంట్‌లో జట్టు తరఫున ఆడి బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సత్తా చాటాడు. ఆదిత్య ఇటీవలే విజయనగరంలో నిర్వహించిన అండర్ 14 సౌత్ జోన్ టోర్నమెంట్‌లో బ్యాటర్‌గా రాణించాడు. అలాగే ఫీల్డింగ్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఈ టోర్నీలో 4 మ్యాచ్‌లు ఆడిన ఆదిత్య 234 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కర్ణాటక జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆదిత్య 93 బంతుల్లో 35 పరుగులు చేయగా, ఆంధ్రా టీమ్‌తో నిర్వహించిన మ్యాచ్‌లో 95 బంతుల్లో 76 పరుగులు చేశాడు. పుదుచ్చేరితో మ్యాచ్ లో 67 బంతుల్లో 50 పరుగులు, కేరళతో మ్యాచ్‌లో 103 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఆయా మ్యాచ్‌ల్లో ఆదిత్య చూపిన ప్రదర్శనకు కోచ్, స్థానికులు అతన్ని అభినందించారు.







