శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 17 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినాన్ని పురస్కరించుకుని నల్లగండ్ల డివిజన్‌లోని గోపనపల్లి ఎన్‌టీఆర్ నగర్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాగం హరిశంకర్ యాదవ్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి, అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక ప్రజలకు టిఫిన్ పంపిణీ చేసి సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో శంకరి రాజు ముదిరాజ్, బాలకృష్ణ, నారాయణ, వెంకటరెడ్డి, నవాజ్ తదితరులు పాల్గొన్నారు. నల్లగండ్ల డివిజన్‌కు చెందిన సీనియర్ నాయకులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.






