ప్ర‌మాదంలో మృతిచెందిన ఆటో డ్రైవ‌ర్ కుటుంబానికి రూ.5 ల‌క్ష‌ల‌ ప్ర‌మాద భీమా మొత్తం చెల్లింపు…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మక్త మహబూబ్ పేట్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బోసు కృష్ణ 2019 డిసెంబ‌ర్ 26న మియాపూర్ చౌరస్తా కళ్యాణ్ గార్డెన్ ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెదారు. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రవేశపెట్టిన డ్రైవర్ ప్రమాద భీమా నుండి రూ.5 ల‌క్ష‌లు మంజూర‌య్యాయి. ఈ క్ర‌మంలో స‌ద‌రు భీమా సంబంధించిన చెక్కును ప్రపంచ మానవ హక్కుల మియాపూర్ ఇన్‌స్పెక్ట‌ర్‌ సామల వెంకటేష్, డిటెక్టీవ్ ఇన్‌స్పెక్ట‌ర్‌ మహేష్ గౌడ్ ఎస్ఐ ర‌వికిర‌ణ్‌ల‌తో క‌లసి ప్రపంచ మానవ హక్కుల సంఘం రాష్ట్ర చైర్మన్ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి బోసు కృష్ణ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక చొర‌వ‌తో 2015లో ప్ర‌మాధ బీమా ప్ర‌వేశ‌పెట్టార‌ని, ఈ భీమా వ‌ల్ల ఎంతో మందికి మేలు జ‌రుగుతుంద‌ని అన్నారు. భీమ ప్రీమియం చెల్లించ‌లేని నిరుపేద డ్రైవ‌ర్ల‌కు ఈ ప‌ధ‌కం ఎంతో మేలు చేస్తుంద‌ని అన్నారు. ఈ భీమా అమ‌ల కావాలంటే ప్ర‌మాదానికి గురైన డ్రైవ‌ర్ లైసెన్స్ వ్యాలిడీటి క‌లిగి ఉండాల‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌తి డ్రైవ‌ర్ విధిగా లైసెన్స్ పొందాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక‌ నాయ‌కులు రాజేష్ గౌడ్‌, కొమ్ముల శామ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

బోసు కృష్ణ కుటుంబ స‌భ్యుల‌కు రూ.5 ల‌క్ష‌ల చెక్కును అంద‌జేస్తున్న ఇన్‌స్పెక్ట‌ర్ సామ‌ల వెంక‌టేశ్‌, డీఐ మ‌హేష్ గౌడ్‌, ఎస్ఐ ర‌వికిర‌ణ్‌, తౌటిరెడ్డి సంతోష్‌రెడ్డి, రాజేష్‌గౌడ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here