చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సీఐ క్యాస్ట్రో రెడ్డిని నేతాజీనగర్ కాలనీ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ సన్మానించారు. ఈ సందర్భంగా సీఐ క్యాస్ట్రో రెడ్డి మాట్లాడుతూ ప్రతి కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. షేక్ ఖాసిం మాట్లాడుతూ గుల్‌మోహర్ పార్క్ కాలనీలో ప్రధాన కూడలిలో 13 సిసి కెమెరాలు ఉన్నాయని తెలియజేశారు. ఇంకా కొన్ని అమర్చాలని అన్నారు. నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ ఇంతకుముందు ఉన్న సిఐ రవీందర్ ఆధ్వర్యంలో నాలుగు సిసి కెమెరాలను ప్రధాన చౌరస్తాలో అమర్చారని అన్నారు. తన సొంత నిధులతో నాలుగు సిసి కెమెరాలు పెట్టించడం జరిగిందని అన్నారు. కాలనీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాత్రి, పగలు పెట్రోలింగ్ వాహనాలను నడపాలని కోరారు. నల్లగండ్ల చెరువు కట్ట చుట్టుపక్కల కొంతమంది యువకులు గంజాయి తాగుతూ వ్యసనాలకు బానిసలవుతున్నారని, వారి మీద ప్రత్యేక నిఘా పెట్టాలని అన్నారు. యువతని సన్మార్గంలో పెట్టే బాధ్యత మన అందరిదీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిల్డర్ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కమర్ పాషా, రాయుడు, రాంబాబు నాయక్, కాలనీ సభ్యులు పాల్గొన్నారు.
