మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మతి స్థిమితం కోల్పోయి రహదారులపై తిరుగుతున్న ఓ బాలున్ని మాదాపూర్ పోలీసులు చేరదీశారు. మాదాపూర్లోని రత్నదీప్ సూపర్ మార్కెట్ వద్ద శుక్రవారం ఆ బాలున్ని పోలీసులు గుర్తించి అతని వివరాలు కనుక్కునే ప్రయత్నం చేశారు. కాగా అతను మానసిక వ్యాధిగ్రస్తుడు అయి ఉంటాడని, తన పేరు, చిరునామా, ఇతర వివరాలను చెప్పలేకపోతున్నాడని, బహుశా అతను ముస్లిం అయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అతన్ని ఎవరైనా గుర్తు పట్టదలిస్తే తమను సంప్రదించాలని పోలీసులు కోరారు.