పోలీసుల త్యాగంతోనే స‌మాజంలో శాంతి భ‌ద్ర‌త‌లు: సీపీ సజ్జనార్

  • అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ

సైబరాబాద్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) ఆధ్వర్యంలో శుక్ర‌వారం సాయంత్రం 400 మందికి పైగా సైబరాబాద్ పోలీస్ సిబ్బంది, వాలంటీర్లు, ప్రజలు సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ నుంచి గచ్చిబౌలి ఫ్లై ఓవర్ మీదుగా సైబరాబాద్ సీపీ ఆఫీసు వ‌ర‌కు కొవ్వొత్తుల ర్యాలీ చేప‌ట్టారు. అనంతరం సీపీ ఆఫీసు ఆవరణలోని అమరవీరుల స్థూపం వద్ద ర్యాలీనీ ముగించి అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.

పోలీసు అమ‌ర‌వీరుల త్యాగాల‌ను స్మ‌రిస్తూ ర్యాలీ నిర్వ‌హిస్తున్న పోలీసు సిబ్బంది, ఎస్సీఎస్సీ ప్ర‌తినిధులు, ప్ర‌జ‌లు, పాల్గొన్న సీపీ సజ్జనార్
పోలీసు అమ‌ర‌వీరుల త్యాగాల‌ను స్మ‌రిస్తూ ర్యాలీ నిర్వ‌హిస్తున్న పోలీసు సిబ్బంది, ఎస్సీఎస్సీ ప్ర‌తినిధులు, ప్ర‌జ‌లు, పాల్గొన్న సీపీ సజ్జనార్

ఈ సందర్భంగా సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. అమరుల త్యాగ ఫలితంగానే నేడు సమాజంలోని ప్రజలంతా విద్రోహ శక్తుల బారిన పడకుండా ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారని గుర్తు చేశారు. వారోత్సవాలలో భాగంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా విధినిర్వహణలో అసువులు బాసిన 264 మంది పోలీసుల‌ త్యాగాలను స్మరించుకుంటూ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలకు పోలీస్ శాఖ పట్ల మరింత నమ్మకం కలిగే విధంగా శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం చేస్తున్న కృషి అమోఘమని అన్నారు. పోలీసులు జాతి సేవకు పునరంకితం కావాలన్నారు.

పోలీసు అమ‌ర‌వీరుల త్యాగాల‌ను స్మ‌రిస్తూ ర్యాలీ నిర్వ‌హిస్తున్న పోలీసు సిబ్బంది, ఎస్సీఎస్సీ ప్ర‌తినిధులు, ప్ర‌జ‌లు, పాల్గొన్న సీపీ సజ్జనార్
పోలీసు అమ‌ర‌వీరుల త్యాగాల‌ను స్మ‌రిస్తూ ర్యాలీ నిర్వ‌హిస్తున్న పోలీసు సిబ్బంది, ఎస్సీఎస్సీ ప్ర‌తినిధులు, ప్ర‌జ‌లు, పాల్గొన్న సీపీ సజ్జనార్

సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల భవిష్యత్తు మంచి కోసం ప్రాణత్యాగాలు చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీసుల త్యాగాలను నిత్యం స్మరించుకోవడం అందరి బాధ్యత అన్నారు. సమాజంలో ఎవరికి ఏ కష్టం, నష్టం, వచ్చినా ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసేనని అన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ మొక్కవోని ధైర్యంతో పోలీసులు విధులు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందారన్నారు.

సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్‌లో పోలీసు అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద కొవ్వొత్తితో నివాళులు అర్పిస్తున్న సీపీ సజ్జనార్

ఈ కార్యక్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ ఎమ్ విజయ్ కుమార్, శంషాబాద్ డీసీపీ ఎన్ ప్రకాష్ రెడ్డి, డీసీపీ క్రైమ్స్ రోహిణి ప్రియదర్శిని, వుమన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయ, బాలానగర్ డీసీపీ పద్మజ‌, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఎస్ఓటీ ఏడీసీపీ సందీప్, ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్ కుమార్, ఏడీసీపీ క్రైమ్స్-I కవిత, ఏడీసీపీ క్రైమ్స్ -II ఇందిర‌, ఏడీసీపీ క్రైమ్స్ –III రామచంద్రుడు, సైబరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్ రాజ్, సీఎస్ డబ్ల్యూ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ వెంకట్ రెడ్డి, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ జనరల్ సెక్రెటరీ కృష్ణ ఏదుల, ఏడీసీపీ (అడ్మిన్) లావణ్య ఎన్జేపీ, ఏసీపీలు, లా అండ్ ఆర్డర్ ఇన్ స్పెక్టర్లు, హెడ్ క్వార్టర్స్ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది, వివిధ ఎన్జీఓలు, ఎస్సీఎస్సీ వాలంటీర్లు, సీపీ ఆఫీసు సెక్షన్ల సిబ్బంది, ఆర్ఐలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here