నందకుమార్ యాదవ్ నివాసానికి విచ్చేసిన బండారు దత్తాత్రేయ…

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ వైస్ ఛైర్మన్ నందకుమార్ యాదవ్ సతీమణి అనురాధగత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న కేంద్ర మాజీ మంత్రి, హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ శేరిలింగంపల్లి గ్రామం రేయిన్ ట్రీ అబాడ్ లోని నందకుమార్ యాదవ్ ఇంటికి వచ్చి వారిని పరామర్శించారు. అనురాధ త్వరగా కోలువాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు చింతకింది గోవర్ధన్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి తోపుగొండ మహిపాల్ రెడ్డి, నాయకులు రాఘవేందర్ రావు, శాంతిభూషణ్ రెడ్డి, విజయలక్ష్మి, రమణీయమ్మ, రాధ మూర్తి, సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here