నమస్తే శేరిలింగంపల్లి: ఒకవైపు కరోనాతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతుంటే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా పెట్రోల్ బాదుడు తీవ్ర ఆందోళనకు గురిచేస్తుందని ఏఐఎఫ్‌డీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కరోనా బారినపడి ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు లేక, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో బేడ్లు దొరకక దొరికినా ఆ బిల్లులు కట్టలేక ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పెట్రోలు ధరలు పెరడం బాదాకరమని అన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరగడానికి మూల కారణం అయిన పెట్రోలు డీజిల్ ధరలను ఒక నెల వ్యవధిలో 13 సార్లు పెంచడం అంటే ప్రభుత్వాలు ప్రజల మీద ఎంత బాధ్యత రహిత్యంగా ఉన్నాయో తెలుస్తుందని అన్నారు. ఇప్పటికే వంట నూనె ధర విపరీతంగా పెరిగిపోయిందని, అదేవిధంగా వంట సామాగ్రి ధరలు కూడా ఘననీయంగా పెరిగిపోతున్నాయని, ఇలాంటి కష్టకాలంలో పెట్రోల్ ధరలు పెంచి ప్రజలపై అధిక భారాన్ని మోపడం సరైనది కాదని అన్నాఉ. పేద మధ్యతరగతి వర్గాలు మరింత పేదరికంలోకి నెట్టబడుతున్న నేపథ్యంలో పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని పల్లె మురళి డిమాండ్ చేశారు.