శేరిలింగంపల్లి, నవంబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): మన పరిసరాలు, రహదారులను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొండాపూర్ డివిజన్ వార్డు కమిటీ మెంబర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రక్తపు జంగం గౌడ్ అన్నారు. జిహెచ్ఎంసి కార్మికులకు ఆయన దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు మనకు అందిస్తున్న సేవలు మరువలేనివని అన్నారు. ముఖ్యంగా కరోనా కాలంలో వారు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి సేవలు అందించారని గుర్తు చేశారు. వారి పట్ల ప్రతి ఒక్కరు కృతజ్ఞతా భావం కలిగి ఉండాలన్నారు.






