ఫుట్‌పాత్‌ల‌ను ఆక్ర‌మిస్తే క‌ఠిన చ‌ర్య‌లు: ట్రాఫిక్ సీఐ ప్ర‌శాంత్

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఫుట్‌పాత్‌ల‌ను ఆక్ర‌మిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, పౌరులు ట్రాఫిక్ స‌జావుగా కొన‌సాగేందుకు స‌హ‌క‌రించాల‌ని మియాపూర్ ట్రాఫిక్ సీఐ ప్ర‌శాంత్ అన్నారు. మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని హెచ్ఎంటీ స్వ‌ర్ణ‌పురి రోడ్డు నుంచి జేపీ న‌గ‌ర్ రోడ్డు వ‌ర‌కు ఉన్న ర‌హ‌దారికి ఇరువైపులా వెల‌సిన ఫుట్‌పాత్ ఆక్ర‌మ‌ణ‌ల‌ను ట్రాఫిక్ పోలీసులు తొల‌గించారు. ఈ సంద‌ర్భంగా సీఐ ప్ర‌శాంత్ మాట్లాడుతూ ఫుట్‌పాత్ ల‌ను ఆక్ర‌మిస్తే ఎవ‌రినీ విడిచిపెట్టేది లేద‌ని, ఎంత‌టి వారిపైనైనా క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. వాహ‌న‌దారులు ట్రాఫిక్ నియ‌మ నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ వాహ‌నాల‌ను న‌డ‌పాల‌ని, ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్ర‌మిస్తే క‌ఠిన చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here