ఓటర్లకు బీజేపీ SIR హెల్ప్ డెస్క్.. ఎన్యూమరేషన్ ఫారాల భర్తీలో సహాయం చేసిన నాయకులు..

శేరిలింగంపల్లి, జూలై 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి అసెంబ్లీ పరిధిలోని హఫీజ్‌పేట్ డివిజన్‌లో సాయి నగర్, యూత్ కాలనీ, గంగారం బస్తీ దవాఖాన వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో SIR హెల్ప్ డెస్క్ (సహాయ కేంద్రం) ఏర్పాటు చేశారు. హఫీజ్‌పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలకు ఎన్యూమరేషన్ ఫారాలను నింపడంలో సహాయం చేసి, అవసరమైన మార్గదర్శకత్వం అందించారు. ఈ సందర్భంగా ప్రతి ఓటరు తమ ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి సమాచారంతో నింపి స్థానిక BLO అధికారులకు సమర్పించాలని నిర్వాహకులు కోరారు. ఓటరు నమోదు ప్రక్రియలో ఎలాంటి సందేహాలు ఉన్నా సహాయ కేంద్రాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో హఫీజ్‌పేట్ డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షుడు రాజు యాదవ్, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్, బీజేపీ నాయకులు శేఖర్ ముదిరాజ్, యువ మోర్చా అధ్యక్షుడు మహేష్ గౌడ్, కార్తీక్, నాగ్ మల్లేష్, లోకేష్, గోవర్దన్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here