- సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు దిష్టిబొమ్మలను దహనం చేసిన బీజేపీ నాయకులు
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా తెరాస ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు శ్రీరాముడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా చందానగర్ డివిజన్ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం ఆ ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి కసిరెడ్డి సింధు రెడ్డి, డివిజన్ బీజేపీ అధ్యక్షుడు రాంరెడ్డి, నాయకులు రఘునాథ్ రెడ్డి, రాజశేఖర్, అశోక్ వర్మ, శ్రీనివాస్, పగడాల శ్రీనివాస్, గొల్లపల్లి శ్రీనివాస్, శ్రీనివాస్ ముదిరాజ్, మధు, శోభా దూబే పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం…
హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మియాపూర్, హఫీజ్ పేట్, మాదాపూర్ డివిజన్ లలో సీఎం కెసిఆర్ దిష్టిబొమ్మలను బీజేపీ నాయకులు దహనం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు జ్ఞానేంద్ర ప్రసాద్, రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రెటరీ శ్రీధర్, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు దోనెపూడి శివ రామ కృష్ణ ప్రసాద్, ఓబిసి అధ్యక్షుడు నాగేశ్వర్ గౌడ్, మియాపూర్ డివిజన్ అధ్యక్షుడు మాణిక్ రావు, హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్, రాధాకృష్ణ, రాఘవేంద్రరావు, మనోహర్, రవి గౌడ్, వరప్రసాద్, సమ్మెట ప్రసాద్, ఐటీ సెల్ కన్వీనర్ కళ్యాణ్, బీజేవైఎం కన్వీనర్ జితేందర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గచ్చిబౌలిలో…
రాముడిపై, మందిర నిర్మాణ నిధి సేకరణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెరాస ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు దిష్టి బొమ్మను గచ్చిబౌలి డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కృష్ణ ముదిరాజ్ ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అనిల్ గౌడ్, డివిజన్ మాజీ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, సీనియర్ నాయకుడు నరేందర్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ చారి, మహేందర్ గౌడ్, వెంకటేష్, భిక్షపతి, వెంకటేష్ గౌడ్, రాహుల్, శివ కుమార్, సతీష్ గౌడ్, మహేశ్వరి, ఇందిర, వరలక్ష్మి పాల్గొన్నారు.
మాదాపూర్‌లో…
శ్రీరాముడిపై, రామ మందిర నిర్మాణం నిమిత్తం చేపట్టిన నిధి సేకరణ కార్యక్రమంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను తెరాస ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతోపాటు రాష్ట్ర సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని మాదాపూర్ డివిజన్ బీజేపీ అభ్యర్థి గంగుల రాధాకృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను ఆయన ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ దేశంలోని హిందువుల మనోభావాలు దెబ్బ తినే విధంగా నీచమైన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు బొక్క బాల్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర నాయకులు హరికృష్ణ, హరి ప్రియ, సీనియర్ నాయకులు జంగయ్య యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, మధు యాదవ్, అరవింద్ సింగ్, వినోద్, కృష్ణ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, శ్రీశైలం యాదవ్, మదనాచారి, గోవర్ధన్, వేణు, బాలకుమార్, బీజేవైఎం అధ్యక్షుడు ఆనంద్, ఉపాధ్యక్షుడు పట్నం రాము, ప్రధాన కార్యదర్శి చరణ్, నరేష్, రాఘవేంద్ర, ఉదయ్, భాజపా కార్యకర్తలు పాల్గొన్నారు.