కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని మస్తాన్‌నగర్‌లో ఆదివారం డివిజన్ బీజేపీ ఇన్‌చార్జి బాల్ద అశోక్ ఆధ్వర్యంలో నాయకులు పాదయాత్ర నిర్వహించారు. స్థానికంగా ఉన్న సమస్యలను వారు పరిశీలించారు. ప్రధానంగా రహదారులు, డ్రైనేజీ, పారిశుధ్య సమస్యలు ఉన్నాయని గుర్తించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెరాస ప్రభుత్వం ఇన్ని ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాసకు ప్రజలు గుణపాఠం చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీజేపీ అధ్యక్షుడు నీలం జయరాములు, నాయకులు ఆత్మారాం, మన్నెం కొండ సాగర్, శ్రీకాంత్ గౌడ్, రాము, వెంకట్ నాయక్, కిషన్ రామ్ సుతార్, శ్యాంరాథోడ్, వినోద్ సర్వి, బాలాజీ, బస్తీవాసి నరేష్ తదితరులు పాల్గొన్నారు.