- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
- చందానగర్ డివిజన్‌లో పర్యటించిన గాంధీ, కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. భారీ వర్షాల కారణంగా జలమయం అయిన ప్రాంతాలను ఆదివారం ఆయన సందర్శించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ ప్రధాన రహదారిపై, అన్నపూర్ణ ఎన్‌క్లేవ్ కాలనీలలో ఆయన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు భారీ వర్షాలకు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయం చేసుకుని ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. భారీగా వరదనీరు చేరే ప్రాంతాల్లో సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి సహాయక చర్యలు చేపట్టాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ చిన్నారెడ్డి, ఏఈ అనురాగ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ జగదీష్, మియాపూర్ డివిజన్ తెరాసఅధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.