శేరిలింగంపల్లి, ఏప్రిల్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ వేమన కాలనీ వీకర్ సెక్షన్ , హైదర్ నగర్ , ఆల్విన్ కాలనీ డివిజన్ మహంకాళి నగర్ చౌరస్తా, మియాపూర్ డివిజన్ ఓంకార్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాలను బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ ఆవిష్కరించి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని అన్నారు. ఆయన తన జీవితాంతం అంటరానితనం, కుల వివక్ష వంటి సామాజిక దురాచారాలపై పోరాటం చేస్తూ సమాజంలో వెనుకబడిన వర్గాల వారికి విద్య, సమానత్వం, గౌరవం లభించే విధంగా కృషి చేసిన నాయకుడు అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, డివిజన్ అధ్యక్షులు, కంటెస్టెడ్ కార్పొరేటర్స్, మహిళా మోర్చా, బీజేవైఎం, దళిత మోర్చా, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.