శేరిలింగంపల్లి, ఏప్రిల్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): డాక్టర్ BR అంబేద్కర్ జయంతిని నడిగడ్డ తండా గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు స్వామి నాయక్ మాట్లాడుతూ అంబేద్కర్ అణగారిన వర్గాల గురించి చేసిన విశేష కృషిని భారత భూమి ఉన్నంత కాలం గుర్తుపెట్టుకుంటుందన్నారు. ఆ మహానుభావుని ఆశయాలను అందరం కలిసి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దశరథ్ నాయక్, తిరుపతి నాయక్, సీతారాం నాయక్, రెడ్యానాయక్, హనుమంతు నాయక్, శంకర్ నాయక్, గోపి నాయక్, లకపతి నాయక్, లక్సమన్ నాయక్, రాఘవేంద్ర, కమలాకర్, రత్నాకర్, అబ్రహం, రవి, మహేష్, సోమేశ్, సచిన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.