శేరిలింగంపల్లి, జనవరి 17 (నమస్తే శేరిలింగంపల్లి): మహారాష్ట్ర స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి, NDA కూటమి విజయం సాధించిన సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ లోనీ రాయిదుర్గంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు బాణసంచాలు పేల్చి స్వీట్లు పంచుకుని విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రంగా రెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు మూల అనిల్ గౌడ్, బిజెపి ఓబీసీ ఉపాధ్యక్షుడు నీలం నరేందర్ కుమార్ ముదిరాజ్ , జిల్లా నాయకుడు నీరుడి సురేష్ ముదిరాజ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి నీలం సురేందర్ ముదిరాజ్,ఉపాధ్యక్షుడు సంజీవ, మాజీ అధ్యక్షుడు కృష్ణ ముదిరాజ్, దయాకర్ ముదిరాజ్, నరసింహ రాజు, అంబటి అశోక్ ముదిరాజ్, BJYM మాజీ అధ్యక్షుడు శివ కుమార్, బూత్ అధ్యక్షుడు సాయి కిరణ్ ముదిరాజ్ , అనిల్ కుమార్ , సూర్య ముదిరాజ్, విష్ణు, రాజేందర్ ముదిరాజ్, దయాకర్ ముదిరాజ్, సుగుణాకర్ ముదిరాజ్ తదితర నాయకులు పాల్గొన్నారు.






