ఘ‌నంగా ముద్దంగుల తిరుపతి కుమార్తె దమయంతి జ‌న్మ‌దిన వేడుక‌లు

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, జీహెచ్ఎంసీ లేబర్ సెల్ ప్రధాన కార్యదర్శి ముద్దంగుల తిరుపతి కుమార్తె ముద్దంగుల దమయంతి శృతి పుట్టినరోజు సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని తన స్వగృహం లో కుటుంబ సభ్యుల సమక్షంలో మియాపూర్ డివిజన్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, అడ్వైజర్ వీరమల్ల సంగీత వీరేందర్ గౌడ్, శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు, ఛైర్ పర్సన్ వుయ్యూరు శ్రీదేవి గౌడ్, వైస్ ఛైర్ పర్సన్ నల్ల హేమలత రెడ్డి, సభ్యులు వుయ్యూరు రాంబాబు , నల్ల సంజీవ రెడ్డి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ పుట్టినరోజు వేడుకల సందర్భంగా నిరు పేదలకు, మున్సిపల్ కార్మికులకు దుస్తులు, చీరలు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ పుట్టినరోజు వేడుకల కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం లేబర్ సెల్ అధ్యక్షుడు మాదిరెడ్డి మోహన్ రెడ్డి, కూకట్ పల్లి 121 డివిజన్ లేబర్ సెల్ అధ్యక్షుడు కృష్ణ, శ్రీకాంత్ రెడ్డి, హఫీజ్ పేట్ డివిజన్ లేబర్ సెల్ అధ్యక్షుడు పరమేశ్వర్, ఉపాధ్యక్షులు బ్రహ్మానందం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here