శ్రీ‌రాంన‌గ‌ర్ కాల‌నీలో హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా బైక్ ర్యాలీ

శేరిలింగంప‌ల్లి, మే 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హనుమాన్ జయంతి సందర్భంగా మసీదు బండ గ్రామం శ్రీరామ్ నగర్ కాలనీ లలోని ఆంజనేయస్వామి ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజలలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ పాల్గొని, అనంతరం శ్రీరామ్ నగర్ కాలనీ హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ హనుమాన్ జయంతి మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, యువత ధర్మ పరిరక్షణతో పాటు సేవా భావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఐక్యత, భక్తి, దేశభక్తి పెంపొందించేందుకు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబుల్ రెడ్డి, అనంత రెడ్డి, ఎల్లా రెడ్డి, విజయ్ కుమార్ , సాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here