శేరిలింగంపల్లి, మే 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి పరిధిలోని పాపిరెడ్డి కాలనీ సందయ్య నగర్లో ఉన్న శ్రీ హనుమాన్ దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఘనంగా పూజా కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కన్నా మిత్ర మండలి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ నాయకుడు పొట్టా నరేందర్ యాదవ్ ప్రజలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొని, హనుమంతుడి ఆశీస్సులు అందరికీ కలగాలని ఆకాంక్షించారు. పొట్టా నరేందర్ యాదవ్ మాట్లాడుతూ హనుమాన్ జయంతి వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, భక్తి భావం, సేవా తత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యుడు కృష్ణ యాదవ్, జములయ్య, వాకిటి శంకర్, సత్యనారాయణ యాదవ్, పాశం రాజు, నవీన్ యాదవ్, సురేష్ రాథోడ్, వీరేష్, రాజశేఖర్, టీమ్ PNY సభ్యులు పాల్గొన్నారు.






