లింగంప‌ల్లిలో ఘనంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం

శేరిలింగంప‌ల్లి, మే 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): లింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సమీపంలోని పద్మా అపార్ట్ మెంట్ లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధునిక నర్సింగ్ వ్యవస్థాపకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా BHEL జనరల్ హాస్పిటల్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ R. పుట్టరాజు హాజ‌రై మాట్లాడుతూ నేటి యువ నర్సులు ఫ్లోరెన్స్ నైటింగేల్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని రోగులకు మరింత మెరుగైన సేవలు అందించాల‌ని కోరారు. కనిపించే దేవుళ్ళు వైద్యులైతే కాపాడే దేవతలే నర్సులు అని కొనియాడారు. ఈ కార్య‌క్ర‌మంలో సత్యసాయి సేవాసమితి రంగారెడ్డి జిల్లా కన్వీనర్ డాక్టర్ B.C.రామన్న, సోషల్ వర్కర్ E. దేవానంద్ యాదవ్, నండూరి వెంకటేశ్వర రాజు, అమ్మయ్య చౌదరి, శివరామకృష్ణ, G.V. రావు, సత్యనారాయణ, వాణిసాంబ శివరావు, విజయలక్ష్మీ , విష్ణుప్రసాద్, బాలాజీ, శివరామిరెడ్డి, వెంకటేశ్వర్లు, పాండు తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వివిధ ప్రభుత్వ వైద్యశాలల్లో సేవ‌లందిస్తున్న 80 మంది నర్సులకు ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుతోపాటు శాలువ, జ్ఞాపిక, పగిడిలతో సన్మానం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here