శేరిలింగంపల్లి, డిసెంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్ పరిధిలోని హరిజన బస్తీకి చెందిన అఖిల అనారోగ్యం కారణంగా చికిత్స నిమిత్తం అయ్యే ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా బాధితురాలికి మంజూరు అయిన రూ.60వేల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును బాధిత కుటుంబానికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.