గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలో కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా గురువారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు ఆయన డివిజన్ పరిధిలోని ఖాజాగూడ పార్టీ కార్యాలయంలో ఓటరు నమోదు ఇన్‌చార్జిలకు ఫాం 18 పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ఇంటింటికీ వెళ్లి పట్టభద్రులను అధిక సంఖ్యలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్లుగా నమోదు చేయించాలని తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన ఫాం 18 అప్లికేషన్, ఓటరు నమోదుకు అభ్యర్థికి ఉండాల్సిన అర్హతలు, కావల్సిన పత్రాలు తదితర అంశాలపై వారికి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు రాజు నాయక్, మహిళా అధ్యక్షురాలు రామేశ్వరమ్మ, వార్డ్ మెంబర్లు జంగయ్య యాదవ్, అంజమ్మ, ఏరియా కమిటీ మెంబర్ రాజు ముదిరాజ్, నాయకులు రమేష్ గౌడ్, జగదీష్, డి.పరమేష్, ఓటర్ నమోదు ఇంచార్జులు పాల్గొన్నారు.