బిల్వ మొక్క‌ను నాటిన శిల్పా ఎన్‌క్లేవ్ వాసులు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ శిల్పా ఎన్‌క్లేవ్ లక్ష్మీ గణపతి ఆల‌య‌ ప్రాంగణంలో దసరా పర్వదినం పురస్కరించుకొని జమ్మి మొక్కను నాటారు. ఈ ఏడాది మూడు వసంతాలు పూర్తి చేసుకుని నాలుగో వసంతంలో అడుగు పెడుతున్న సంద‌ర్భంగా ప్రక్కనే మరో బిల్వ మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో శిల్ప ఎన్‌క్లేవ్ సెక్రటరీ జయ కుమార్, కోశాధికారి శ్రీధర్, వేణుగోపాల్, శిల్ప ఎంక్లేవ్ వాసి ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 327 ఐ ఎన్ టి యు సి స్టేట్ వైస్ ప్రెసిడెంట్, సైబర్ సిటీ సర్కిల్ రీజనల్ ప్రెసిడెంట్ కె. వెంకటేశ్వర్లు, నరేష్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here