శేరిలింగంపల్లి, డిసెంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): దౌల్తాబాద్ మాజీ ఎంపీపీ వావిలాల నరసింహులు యాదవ్ సతీమణి గ్రామపంచాయతీ బీఆర్ఎస్ పార్టీ తరపున గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఫుట్బాల్ గుర్తుగా వావిలాల సంగీత నర్సింలు దౌల్తాబాద్ గ్రామ సర్పంచ్ గా గెలుపొందారు. ఈ సందర్భంగా బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ వారిని అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. దౌల్తాబాద్ గ్రామపంచాయతీ ని అభివృద్ధి దిశగా నడిపించాలని ప్రతి అంశంలోనూ ప్రజలకు తోడుల నీడలా ఉండాలని పరిపాలన సమపాలనగా ఉండాలని అన్నారు. జనం మిమ్మల్ని గెలిపించారు మీరు జనాన్ని గెలిపించాలి జనాల నమ్మకాన్ని గెలిపించాలి వారి అభివృద్ధికై పాటుపడాలి అని అన్నారు. ప్రజా పరిపాలనలో ప్రజల ఆదరణతో మరిన్ని పదవులు అధిరోహించి ప్రజాసేవ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కృష్ణ యాదవ్, పాములేటి యాదవ్, అందెల సత్యనారాయణ యాదవ్, వార్డ్ మెంబర్ రాజు, రాక్ స్టార్ కొడకంచి శ్రీశైలం యాదవ్, యాదవ్ సంఘం, బీసీ సంఘాల నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.






