సాయిన‌గ‌ర్ డ‌బుల్ బెడ్ రూమ్ కాల‌నీలో ప్రీ క్రిస్మ‌స్ వేడుక‌లు

శేరిలింగంపల్లి, డిసెంబ‌ర్ 20 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని హ‌ఫీజ్‌పేట డివిజ‌న్ ప‌రిధిలో ఉన్న సాయిన‌గ‌ర్ డ‌బుల్ బెడ్ రూమ్ కాల‌నీలో ప్రీ క్రిస్మ‌స్ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. డివిజ‌న్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు బాలింగ్ గౌత‌మ్ గౌడ్ ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా పాల్గొని స్థానికుల‌కు క్రిస్మ‌స్ పండుగ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. పండుగ సందర్భంగా ప్రజలందరికీ శాంతి, సౌఖ్యం, ఆనందం కలగాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో నిర్వాహ‌కుడు సుదేశ్ కుమార్‌, పాస్ట‌ర్ ర‌మేష్‌, సీఐ శ్యామ‌ల వెంక‌టేష్, కాల‌నీ అసోసియేషన్ స‌భ్యులు శ్యామ్ సాగ‌ర్‌, శ్రావ‌ణ్‌, మోజేష్‌, దేవ‌రాజ్‌, హ‌నుమంత్‌, రాజు, న‌ర‌సింహులు, చంద్ర‌, సిగ‌య్య‌, కొమ‌ర‌య్య పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here