శేరిలింగంపల్లి, నవంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓ బీసీ మేలుకో.. నీ గ్రామాన్ని ఏలుకో.. పేరుతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ , ఎస్ దుర్గయ్య గౌడ్ , బోయ గోపి, మెట్టు ధన్ రాజ్, అంబాల నారాయణ గౌడ్, యెలికట్టె విజయ్ కుమార్ గౌడ్ , బైర శేఖర్ మాట్లాడుతూ జనరల్ స్థానాలను బీసీలు కైవసం చేసుకుని అగ్రకులాలను ఓడించాలని పిలుపునిచ్చారు. 46 జీవోను తెచ్చి బీసీలను నయవంచన చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ గత రెండు సంవత్సరాలుగా జీవోలు, ఆర్డినెన్స్ ల పేరుతో కాలయాపన చేసి చివరకు 46వ జీవో పేరుతో బీసీలను మరోసారి వంచనా, మోసం చేశారని అన్నారు. తేనె పూసిన కత్తితో బీసీల గొంతు కోశారని అన్నారు. 12,735 గ్రామపంచాయతీలలో కేవలం 2176 గ్రామపంచాయతీలు బీసీలకు ఇచ్చి17 శాతానికి పరిమితం చేసి బీసీలను గ్రామపంచాయతీలలో రాజకీయంగా సమాధి చేసే కుట్రలు చేసిన కాంగ్రెస్ ను గ్రామపంచాయతీలలో బొంద పెట్టాలని బీసీలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాగభూషణం, గోలి యాదగిరి రజక, కోయడ హర్షవర్ధన్ గౌడ్, కొంకిస సచిన్, సింగం నాగేశ్వర్ గౌడ్, చింతలబస్తీ అనిల్, బంటారం యాదగిరి, గోల్నాక సత్తయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






