ఆదర్శ్ నగర్ కాలనీలో కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు ప్రారంభం

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 27 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని ఆదర్శ్ నగర్ కాలనీలో రూ. 5,00,000 అంచనా వ్యయంతో ఎమ్మెల్యే (CDP FUNDS ) నిధులు, కాలనీ అసోసియేషన్, కాలనీ వాసులు, దాతల సహాయంతో మొత్తం రూ.6, 50,000 నిధుల‌తో నిర్మించిన కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తును పిఏసీ ఛైర్మెన్, శాసనసభ్యుడు ఆరెక‌పూడి గాంధీతో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్ భవనానికి సంబంధించి త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టి అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు.కమ్యూనిటీ హాల్ ను కాలనీ సంక్షేమం అభివృద్ధి కోసం చక్కగా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. కమ్యూనిటీ హాల్ లో సమావేశాలు, సభలు, జన్మదిన వేడుకలు నిర్వహించుకునేందుకు వీలుగా భవనం నిర్మించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కాలనీ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తామని, ఏ చిన్న సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రామ స్వామి యాదవ్, డివిజన్ జనరల్ సెక్రటరీ రవీందర్ గౌడ్, సీనియర్ నాయకుడు రమణ మూర్తి, ఆదర్శ్ నగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ జి వి రావు, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్, జాయింట్ సెక్రటరీ మోహన రావు, బాలన్న, ఆర్గనైజషన్ సెక్రటరీ లక్ష్మి నాయుడు, జాయింట్ ఆర్గనైజషన్ సెక్రటరీ సత్యనారాయణ, ట్రెజరర్ శిద్దేశ్వర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వర్గీస్, నాగేశ్వర్ రావు, ప్రసాద్, రామకృష్ణ, శ్రీనివాస్ రావు, విజేందర్ రెడ్డి, మహేష్, బాపిరాజు, మూర్తి, వరప్రసాద్, రజినీకాంత్, సుభాష్, రమేష్, సుధాకర్ రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here