శేరిలింగంపల్లి, నవంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా ముఖ్యమంత్రి సహాయనిధి CMRF LOC ద్వారా మంజూరైన రూ.3,00,000 ఆర్థిక సహాయానికి సంబందించిన CMRF LOC మంజూరు పత్రాలను బాధిత కుటుంబాలకు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరం అని అన్నారు. ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, జిల్లా గణేష్, నరేష్, చిరుమర్తి రాజు, మంజుల, పద్మ, రాధాబాయి తదితరులు పాల్గొన్నారు.






