పేద కార్మికులు, వర్కర్ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలి: భేరి రామచంద్ర యాదవ్

శేరిలింగంప‌ల్లి, జూలై 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పేద కార్మికులు, వర్కర్ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని, వారి సంక్షేమం కోసం కృషి చేయాల‌ని కోరుతూ కార్మిక ఉపాధి శాఖ మంత్రిని భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం చైర్మన్ కే లక్ష్మయ్య, బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ లు క‌లిసి విన‌తిప‌త్రం అంద‌జేశారు. భవన నిర్మాణ కార్మికులు, పేద కూలీలు, కార్మిక వర్కర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు అందేలా సహాయపడాలని కోరారు. కార్మికులు, పేదలు, కూలీలను అన్ని విధాలా ఆదుకోవాలని బీసీ ఫెడరేషన్, బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ కి విన‌తిప‌త్రం అంద‌జేశారు.

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ పేదలైన భవన నిర్మాణ కార్మికులు, కూలీలకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. భవన నిర్మాణ కార్మికులు, కూలీల డిమాండ్స్ కు పరిష్కారం చూపాల‌న్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌ను కేటాయించాల‌ని, అన్ని విధాలుగా స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌ని, పేద కార్మికుల పిల్ల‌ల‌కు ఉచిత కార్పొరేట్ విద్య అందేలా చూడాల‌ని, ఇన్సూరెన్స్ క‌ల్పించి వైద్యం ప‌ట్ల భ‌రోసా అందించాల‌ని, పేద విద్యార్థుల‌కు విదేశీ విద్య‌కు రూ.20 ల‌క్ష‌ల రుణం ఇప్పించాల‌ని కోరారు.

ఈ కార్యక్రమంలో జాతీయ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్, చైర్మన్ లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి అనంతయ్య, బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, మాజీ డిఎస్పి పోలీస్ బంటు రాములు, అనంతయ్య కుమార్ యాదవ్, కార్యదర్శి మేకు నరే ఆనంద్, రాష్ట్ర కార్యదర్శి కాశీనాథ్, జిహెచ్ఎంసి ప్రధాన కార్యదర్శి కిషన్, సలహాదారు అనంతయ్య, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున రావు, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు ఉప్పరి కిష్టయ్య, గ్రేటర్ హైదరాబాద్ నాయకులు ప్రదీప్ మహేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here