శేరిలింగంపల్లి, ఆగస్టు 20 (నమస్తే శేరిలింగంపల్లి): చట్టపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అధికార కాంగ్రెస్ పార్టీకి బీసీలు తగిన గుణపాఠం చెప్పాలని, శేరిలింగంపల్లి నియోజకవర్గం అధ్యక్షుడు మాధవరావు డిమాండ్ చేశారు. రిజర్వేషన్ రావడం వలన ఉద్యోగ అవకాశాలు బీసీలకు లభిస్తాయని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల లోపు బీసీలకు 42 శాతం అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలలో బీసీలు పోటీ చేయడానికి ముందు వరుసలో ఉన్నారని, ఉన్నతమైన చదువులు చదివిన విద్యార్థులకు ప్రభుత్వాలు ఎన్ని మారినా ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని అన్నారు. కనీసం బీసీలకు రిజర్వేషన్ కల్పించడం వలన చదువుకున్న మేధావులు స్థానిక సంస్థలలో సర్పంచులుగా గెలవడం వలన గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, ఈనెల 25 తేదీన హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో చేపటనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. శేరిలింగంపల్లి బిసి కుటుంబ సభ్యులు సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయడానికి భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు.






