శేరిలింగంపల్లి, ఆగస్టు 20 (నమస్తే శేరిలింగంపల్లి): PRTU జిన్నారం మండల అధ్యక్షుడు HV అనిల్ కుమార్ ఆధ్వర్యంలో CPS రద్దుకు సెప్టెంబర్ 1 న హైదరాబాద్ లో జరిగే ధర్నా గోడ పత్రికను మండల విద్యాధికారి కుమార స్వామి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు మృదుల, సంధ్యారాణి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రతి ఉపాధ్యాయుడు కచ్చితంగా చలో హైదరాబాద్ మహా ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని మండల అధ్యక్షుడు అనిల్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ పవన్ రాజు, వైస్ ప్రెసిడెంట్ త్రిశూల్‌నాథ్ , నరేంద్రబాబు, దావునూరి చంద్రశేఖర్, బాల నర్సింహ రెడ్డి, వెంకట్ రెడ్డి, షాకీర్ హుస్సేన్, సెక్రటరీ రవికుమార్, మహిళా సెక్రటరీ పుష్పలత, రవీందర్ రెడ్డి, అంజయ్య, నాగ రాములు, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






