నమస్తే శేరిలింగంపల్లి: నాగర్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో గురువారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞనేంద్ర ప్రసాద్ భాగస్వామ్యులయ్యారు. ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో నిడమనూరులో జరిగిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రోడ్‌షోలో సీనియర్ నాయకులు బాబుమోహన్, విజయశాంతి, వివేక్, సీనియర్ నాయకులతో కలసి జ్ఞానేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. అదేవిధంగా బిజెపి అభ్యర్థి రవినాయక్ మద్ధతుగా స్థానికంగా ప్రచారం నిర్వహించారు. అటు టీఆర్ఎస్‌కు, ఇటు కాంగ్రెస్‌కు బుద్ది చెప్పి రవినాయక్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను జ్ఞనేంద్ర ప్రసాద్ అభ్యర్ధించారు.
